హీరోల కోసం ప్రాణాలను సైతం అభిమానులు లెక్క చేయరు. అలాంటి వీరాభిమానులకు కష్టం వస్తే.. హీరోలు స్పందిస్తారా? అంటే.. కచ్చితంగా స్పందిస్తారనే సమాధానం వినపడుతుంది. ఈ మధ్య హీరోలు వారి అభిమానులను ప్రత్యేకంగా కలుసుకుని వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. నల్గొండ జిల్లా రాజపేట మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి .. హీరో వెంకటేష్‌కు పెద్ద అభిమాని. ప్రస్తుతతం హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ శైలజాపురి కాలనీ ఉంటున్నాడు. సురేష్ వెంకటేష్ నటించిన సినిమాలన్నింటినీ మిస్ కాకుండా చూసేవాడు. అభిమాని గురించిన విషయం తెలుసుకున్న వెంకటేష్ అభిమాని ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఏమీ కాదని ధైర్యం చెప్పారు.
previous post
next post