Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో చాలా తెలివిగా కెరియర్ సాగిస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. ఒకప్పుడు టాప్ నలుగురు హీరోలలో… ఒకరి గా ఉండే వెంకటేష్.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలు చేసేవారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో వెంకీ యాక్టింగ్ కి సినిమా ధియేటర్ లో కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు కచ్చితంగా జేబులోనుండి కర్చీఫ్ తీసే రీతిలో.. వెండితెరపై తన పర్ఫామెన్స్ చూపించేవారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ జనరేషన్ తర్వాత ఇప్పుడు కుర్ర హీరోల హవా కొనసాగుతూ ఉండటం తో.. వెంకటేష్ తన స్టార్ డమ్ ఎక్కడ తగ్గిపోకుండా మల్టీస్టారర్ సినిమాలు ప్రస్తుత తరం హీరోలతో చేస్తూ విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉన్నారు.
ఇప్పటికే మహేష్, పవన్, రామ్, నాగ చైతన్య రీసెంట్ గా వరుణ్ తేజ్ తో f3 చేసిన వెంకటేష్ తాజాగా ఇండస్ట్రీలో కొద్ది గ్యాప్ తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే వాస్తవానికి ఎఫ్ త్రీ సినిమా తరువాత “జాతి రత్నాలు” ఫేమ్.. అనుదీప్ ప్రాజెక్ట్ వెంకటేష్ మొదలు పెట్టాలి. కానీ ఈ ప్రాజెక్టుని పక్కనపెట్టి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్ర చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. తన పాత్ర షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే దిశగా వెంకటేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని ఆగస్టు నెల నుండి అనుదీప్ దర్శకత్వంలో ఓకే చేసిన సినిమా రెగ్యులర్ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ కానున్నట్లు సరికొత్త టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…