సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్‌కు సందడి చేశాయి. ఈ సినిమాలన్నీ పోటీగా నిలిచి బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చిత్రంగా నిలిచిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఎఫ్2’. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేష్లో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ ఏవరు ఊహించని రేంజ్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రిలీజై 50 రోజులు కంప్లీట్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. అతితక్కువ బడ్జట్ తో తెరకెక్కిన ‘ఎఫ్2’ సినిమా 106 సెంటర్స్ లో 50 డేస్ పూర్తి చేసుకోని చిన్న చిత్రాలకి పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రస్తుతం ఉన్న సిట్యూవేషన్స్‌లో ఒక సినిమా వన్ వీన్ రన్ అవ్వడమే కష్టం, అలాంటిది ‘ఎఫ్2’ రిలీజై 50 రోజులు అవుతున్న ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
చాలా కాలం తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఉన్న సినిమాలో నటించి ప్రేక్షకుల కడుపు చెక్కలు చేయడంతో ఆడియన్స్ ఇప్పటికీ థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ రాకతో ‘ఎఫ్2’ సినిమా 140కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు క్రియేట్ చేసిన సౌత్ ఇండియా ఫస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా నిలిచింది. ఊహించిన దానికన్నా భారీ విజయం సాధించడంతో ‘ఎఫ్2’ సినిమాకి అనిల్ రావిపూడి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వెంకీ, వరుణ్ చేసిన కామెడీకి నితిన్ కూడా తోడవవుతుండడంతో ‘ఎఫ్2’ కాస్త ‘ఎఫ్3’గా మారి మరింత ఫన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
previous post
next post