NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బ్ర‌హ్మానందం, ‘వేణుమాధ‌వ్’ల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణం ఇదే..!

వేణుమాధ‌వ్ ఒక స్టార్ క‌మెడియ‌న్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. కామెడీ కింగ్ గా ఆయ‌న‌కు పేరు ఉంది. ఆయ‌న న‌టించిన ప్ర‌తీ సినిమాలో త‌న‌దైన మార్క్ వేసుకుంటారు. కామెడీ కోరుకునే వారు వేణుమాధ‌వ్ సినిమాల‌ను భ‌లే ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి గొప్ప క‌మెడియ‌న్ ను తెలుగు సిని ఇండ‌స్ట్రీ కోల్పొయింది. ఆయ‌న 2019 సెప్టెంబ‌ర్ 25న వేణు మాధ‌వ్ తుదిశ్వాస విడిచారు. చిన్న వ‌య‌సులో అనారోగ్యంతో ఆయ‌న మృతి చెందాడు.

అయితే ఆయ‌న బ్ర‌తికున్న‌ప్పుడు బ్ర‌హ్మానందంతో గొడ‌వ‌లు ఉండేవ‌ని పుకార్లు చాలా ఉండేవి. అయితే వీటిపై ఎన్న‌డూ బ్ర‌హ్మానందంగానీ, వేణుమాధ‌వ్ గానీ ఎన్న‌డూ బ‌య‌ట మాట్లడ‌లేదు. దాంతో ఈ పుకార్లు అలాగే ఉండిపోయాయి. అయితే వేణు మాధ‌వ్ చనిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న ఫ్యామిలీ దీనిపై ఎక్క‌డా మాట్ల‌డ‌లేదు. అయితే ఈ మ‌ధ్య వేణు మాధ‌వ్ భార్యా, పిల్ల‌లు ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. అందులో వారు ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు.

వేణు మాధవ్ భార్య శ్రీవాణి, కొడుకులు సావికర్ , ప్రభాకర్ లు వేణు మాధవ్ గురించి ప‌లు విష‌యాల‌ను చెప్పారు. ఆయ‌న‌కు పరిశ్రమలోని పెద్దలతో ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేశారు. అయితే వేణు మాధ‌వ్ కు బ్ర‌హ్మానందంతో ఉన్న గొడ‌వ‌ల గురించి కూడా ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. అస‌లు వేణుమాధ‌వ్ కు బ్ర‌హ్మానందానికి గొడ‌వ‌లే లేవ‌ని వారు చెప్పారు.

వారిద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌న్న‌ది కేవ‌లం పుకార్లు మాత్ర‌మే అని తెలిపారు. ఈ విష‌యంపై వేణు మాధ‌వ్ భార్య శ్రీవాణి మాట్లాడుతూ.. వారిద్ద‌రూ అప్పుడ‌ప్పుడు సరదాగా తిట్టుకొనే వార‌ని తెలిపారు. దాని అర్థం చేసుకోలేని వారు వారిమ‌ధ్య గొడ‌వ‌లంటూ పుకార్ల‌ను సృష్టించారని తెలిపారు. నిజానికి వేణుమాధ‌వ్, బ్ర‌హ్మానందం మంచి స్నేహితుల‌ని తెలిపారు.

అలాగే వేణు మాధవ్ తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనేవారని తెలిపారు. తమ ఇంటినుంచి వెళ్లే స‌మ‌యంలోనే త‌ను మేక‌ప్ వేసుకోవ‌డం, డైలాగ్స్ ను ప్రాక్టిస్ చేయ‌డం లాంటివి చేసేవాడ‌ని తెలిపారు. ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడి సంపాదించార‌ని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ , నాగబాబుల‌తో మంచి సంబంధాలు ఉండేవ‌ని ఆమె తెలిపారు.

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella