Sreeleela: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సెలబ్రిటీల జీవితాలలో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో దేశ రాజకీయాలలో ఈయన చెప్పిన చాలా విషయాలు జరిగాయి. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన హీరోల జాతకాలు బట్టి ముందుగానే సినిమా ఫలితాలు వాళ్ళ కెరియర్ ఏ రకంగా ఉంటుంది చెప్పుకొస్తారు. అదేవిధంగా జరగబోయే ఎన్నికలలో నాయకుల జాతకాలు బట్టి విజయం సాధిస్తారో లేదో కూడా జ్యోతిష్యం చెబుతారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఫలితాలు ఈయన చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో కొంతమంది జాతకాలు వారి కెరియర్లో శని పోవాలంటే ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు.
ఈ రకంగా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుని టాప్ హీరోయిన్స్ అయిన వాళ్లు రష్మిక మందన పలువురు దక్షిణాది రంగానికి చెందిన హీరోయిన్స్. ఈ క్రమంలో తాజాగా ఈ జ్యోతిష్యుడు వేణు స్వామి యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీ లీల జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది. 2028వ సంవత్సరానికి నంబర్ వన్ హీరోయిన్ గా శ్రీ లీల మారుతుంది. ఆమెది మీనరాశి.. రాజయోగం కూడా ఉంది. నయనతార జాతకం శ్రీ లీల జాతకంకి చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి.
నయనతారల.. శ్రీ లీల కూడా.. సూపర్ స్టార్ అవుతుంది.. అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. నయనతార దాదాపు 15 సంవత్సరాలకు పైగా టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ఉంది. పెళ్లి చేసుకున్న గాని ఇటీవల షారుక్ ఖాన్ తో నటించిన జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక శ్రీలీలా “పెళ్లి సందడి” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్… మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ ఉంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలో శ్రీలీలపై.. వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.