NewsOrbit
సినిమా

Vidya Balan: `శ్రీవ‌ల్లి` పాట‌కు విద్యా బాల‌న్ స్టెప్పులు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Advertisements
Share

Vidya Balan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ క‌లిసి నిర్మించారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా చేశారు.

Advertisements

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది డిసెంబర్‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. మ్యూజిక‌ల్‌గా కూడా ఈ సినిమా మంచి మార్కులు వేయించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని `శ్రీ‌వ‌ల్లి` పాట ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Advertisements

ఈ సాంగ్, ఇందులోని బ‌న్నీ డిఫ‌రెంట్ స్టెప్స్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో.. యూట్యూబ్‌లో అనేక రికార్డులను నెల‌కొల్పింది. పైగా బన్నీని అనుస‌రిస్తూ ఎంద‌రో సెల‌బ్రెటీలు ఈ పాట‌కు కాలు క‌దిపారు. తాజాగా బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ వంతు వ‌చ్చింది. కంప్లీట్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని శ్రీవ‌ల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.

అలాగే చివ‌ర్లో `త‌గ్గేదే లే` అంటూ బ‌న్నీ మ్యాన‌రిజ‌మ్‌ను కూడా దింపేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటిజ‌న్లli ఆల‌రిస్తూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, విద్యా బాల‌న్‌ న‌టించిన జ‌ల్సా సినిమా ఇటీవ‌లె ఓటీటీలో విడుద‌లైంది. అలాగే ప్ర‌స్తుతం ఈ భామ `ల‌వ‌ర్స్` అనే మూవీలో న‌టిస్తోంది.


Share
Advertisements

Related posts

కియారా అద్వాని ఖాళీ లేదన్నా క్యూ కడుతున్నారే ..?

GRK

ఏంటి ఒక్క రోజు కి సుశాంత్ తో రియా అంతా ఖర్చు పెట్టించేదా ?

arun kanna

నాని `ద‌స‌రా`కు క‌ళ్లు చెదిరే రీతిలో జ‌రుగుతున్న బిజినెస్‌.. అన్ని కోట్లా..?

kavya N