నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కోలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా.. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలు పక్కన పెట్టి విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరించింది.. అయితే ఇటీవల మీనా ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే..ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశారు.. శ్వాస సంబంధిత వ్యాధి వల్ల విద్యాసాగర్ మరణించారు. అయితే ఆమె భర్త మరణంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు సాగాయి. దీంతో ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని మీనా వేడుకున్నారు.
ఈక్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. విద్యాసాగర్ తో మీనా పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.. సినిమాలకు స్వస్తి పలికిన తర్వాత మీనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె తల్లి రాజమల్లిక మీనా కోసం పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేసిందట.. ఎన్నో సంబంధాలను చూసిందట.. ఈక్రమంలో మీనా మేనత్త ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది.. విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోవాలని చెప్పిందట.. ఇద్దిరికీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది..అయితే మీనాకు విద్యాసాగర్ నచ్చలేదు. ఇద్దరి వృత్తులు, ఆలోచనలు వేర్వేరుగా ఉండటంతో అతడిని నో చెప్పేసింది.. అతను అర్థం చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు..
అయితే మీనా మేనత్త మాత్రం బలవంతంగా ఒప్పించిందట.. విద్యాసాగర్ ఓ మంచి మనిషి అని, అలాంటి వ్యక్తిని కోల్పోతే జీవితంలో మళ్లీ దొరకడని గట్టిగానే చెప్పిందట.. దీంతో మళ్లీ విద్యాసాగర్ తో కలిసి మాట్లాడి.. పెళ్లికి ఒకే చెప్పిందట.. అలా విద్యాసాగర్ తో మీనా పెళ్లి జరిగింది.. వీరిద్దరికీ నైనిక అనే కూతురు ఉంది. నైనికా సైతం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. భర్త మరణం తర్వాత మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ కి హాజరయ్యారు. మీనా తాజాగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నానని, మీరు కూడా ఆర్గాన్ డొనేట్ చేయాలని సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!