Vijay : కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ్ ఒకరు.తలపతి సినిమాలో నటించడం ద్వారా ఏకంగా విజయ్ తలపతిగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్ సినిమాలకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలకావడంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని సంపాదించుకుంది.ఇకపోతే తమిళంలో మరో కొత్త ప్రాజెక్టుకు విజయ్ మార్చి 31న పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ 65వ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే విజయ్ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో విద్యుత్ జమ్వాల్ విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై విద్యుత్ జమ్వాల్ స్పందిస్తూ ఈ పుకార్లను కొట్టిపారేసారు. విజయ్ తో సినిమా చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని, కానీ విజయ 65వ సినిమాలో తాను నటించడం లేదని విద్యుత్ క్లారిటీ ఇచ్చారు.
విజయ్ తుపాకీ:
అజిత్ నటించిన బిల్లా 2 చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యుత్ జమ్వాల్ , విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకీ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇకపోతే విజయ్ తో మరో సినిమా చేస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు విద్యుత్ జమ్వాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్
కోలమావు కోకిల, డాక్టర్ సినిమాల తరువాత ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు, ఇతర నటీనటులు ఎవరనే విషయం గురించి తెలియాల్సి ఉంది.