ఆగిన సినిమా మొద‌లవుతుంది


విజ‌య్ దేవ‌రకొండ క‌థానాయ‌కుడిగా కొన్నాళ్ల క్రితం `హీరో` అనే చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బ‌డ్జెట్ ప‌రిమితులు దాటుతుండ‌టం స‌హా కొన్ని కార‌ణాల‌తో నిర్మాత‌లు సినిమాను ఆపేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమా మొద‌లు కానుంది. ఇప్ప‌టికే కొన్ని రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఢిల్లీ నేష‌న‌ల్ సర్క్యూట్‌లో రోజుకు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చు చొప్పున 15రోజుల పాటు రేసింగ్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అక్క‌డే షూటింగ్‌ను ప్రారంభిస్తార‌ట‌. ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ రేస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ పాత్ర కోసం ఈయ‌న కోయంబ‌త్తూరులో మూడు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు.