తెలుగు హీరోతో న‌య‌న్

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్న న‌య‌న‌తార‌.. ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు అయినా క్రేజ్ త‌గ్గ‌లేదు.. స‌రిక‌దా పెరుగుతూ వ‌స్తుంది. త్వ‌ర‌లోనే న‌య‌న‌తార తెలుగులో క్రేజీ స్టార్‌గా యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించ‌బోతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భ‌ర‌త్ క‌మ్మ కాంబినేష‌న్‌లో `డియ‌ర్‌కామ్రేడ్‌` సినిమా రూపొందుతుంది. దీని త‌ర్వాత క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు విజ‌య్‌. దీని త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార‌ను తీసుకుంటే బావుంటుంద‌ని, ఇటు తెలుగులోనూ, అటు త‌మిళంలోనూ క్రేజ్ వ‌స్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.