సినిమా

Vijay-Samantha: విజ‌య్‌-స‌మంత మూవీపై మాసివ్ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌?!

Share

Vijay-Samantha: రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లె డౌన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `లైగ‌ర్‌` సినిమాను పూర్తి చేశాడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం ఆగ‌స్టు లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈలోపే పూరీతో మ‌రో కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశాడు విజ‌య్‌. అదే `జనగణమన`

మార్చి ఆఖ‌రి వారంలో ఈ సినిమాను అధికారికంగా లాంఛ్ చేశారు. శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి.. వ‌చ్చే ఏడాది ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. విజ‌య్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాపై మ‌రో మాసివ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈనెల 21వ తేదీన హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ఈ సినిమాను లాంచ్ చేసి.. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఆ తర్వాత ఇదే నెల 23నుంచే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ సైతం ప్రారంభం కానుంద‌ని తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

samantha

ఈ వార్త‌తో అటు విజ‌య్ ఫ్యాన్స్‌, ఇటు సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, స‌మంత ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈమె `శాకుంతలం`, `యశోద` అనే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అలాగే విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌ల‌తో క‌లిసి త‌మిళంలో సామ్ చేసిన `కాతువాకుల రెండు కాదల్‌` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి.

 


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసితో నేను ఓడిపోయాను నువ్వే కాపాడాలన్న నందు.. అంకితను ట్రాప్ చేసిన లాస్య..

bharani jella

KGF 2 RRR: “కేజిఎఫ్ 2” టీం ఆ ఒకటి చేసి ఉంటే “ఆర్ఆర్ఆర్” రికార్డులు కనుమరుగైపోయేవి..??

P Sekhar

నిర్మాణ రంగంలోకి ఎన్టీఆర్‌?

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar