సాధారణంగా ఓ ఇంటివాడయ్యాడంటే కారణం పెళ్లి చేసుకున్నాడని అర్థం. కానీ విజయ్ దేవరకొండ విషయంలో ప్రస్తుత అర్థం అది కాదు.. ఆయన ఓ ఇంటిని కొనుకున్నాడట. ఫిల్మ్నగర్లో హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో నిర్మించిన ఓ ఇంటిని విజయ్ దేవరకొండ స్వంతం చేసుకున్నాడట. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంటిలోకి గృహ ప్రవేశం చేశాడట విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ యువ హీరో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` చిత్రంలో నటించబోతున్నాడు.