Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయకపోయినా… పది సంవత్సరాలు ఒక్క హిట్టు లేకపోయినా గాని బాక్సాఫీస్ ని రూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓపెనింగ్స్ రాబట్టడంలో పవన్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమా “ఖుషి” అని అందరికీ తెలుసు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా .. అప్పట్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. పవన్ మేనరిజం స్టైల్.. అప్పటి కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రొమాంటిక్ గా సినిమా తెరకెక్కడం తో… చాలా సెంటర్లలలో వంద రోజులకు పైగా సినిమా ప్రదర్శితమైంది. ఇంతటి సూపర్ డూపర్ హిట్ అయిన “ఖుషి” టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ విజయ్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఖుషి అని లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ సమంత నటిస్తున్నట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జులై నుండి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఆగస్టు మాసంలో సినిమా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే పూరి దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ ఓకే చేయటం తెలిసిందే. అయితే ఒక పక్క శివ ప్రాజెక్టు తో పాటు మరోపక్క పూరి తో చేయబోయే సెకండ్ మూవీ షూటింగ్ కూడా ఒకదానితో మరొకటి చేయాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్.