“అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. ఈ సినిమా విజయంతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ…ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాలని తెగ ఆరాట పడుతున్నట్టు టాక్. దీనిలో భాగంగా పాన్ ఇండియా అంటే చాలావరకు ప్రేక్షకుల దృష్టి బాలీవుడ్ పైన ఉంటుంది. కానీ రౌడీ విజయ్ రివర్స్ గా సౌత్ మొత్తం కవర్ చేయటానికి సరికొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటిదాకా మన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ యూట్యూబ్ వెర్షన్ లు గురించి స్పెషల్ పోస్టర్లు చూశాం. కానీ లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్” మలయాళ డబ్బింగ్ గురించి పోస్టర్ రిలీజ్ అయింది. దాదాపు కనివిని ఎరుగని రీతిలో 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో రౌడీ విజయ్ దేవరకొండ ఎంత తక్కువ టైమ్ లోనే మలయాళం ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయ్యారా అనే డిస్కషన్ లు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి.
మరోపక్క కేరళలో స్టైలిష్ స్టార్ కి మంచి మార్కెట్ ఉండటంతో త్వరలో ఈ మెగా హీరోకి విజయ్ దేవరకొండ పోటీ ఇవ్వడం గ్యారెంటీ అనే టాక్ సౌత్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ కేరళలో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కడంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా పెరగటంతో రౌడీ విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?