సినిమా

Vijay Devarakonda-Samantha: సమంతపై యుద్దం ప్రకటించిన టాలీవుడ్ రౌడీ.. ఏం జ‌రిగిందంటే?

Share

Vijay Devarakonda-Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత‌పై టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ యుద్దం ప్ర‌క‌టించారు. యుద్దం ఏంటీ..? అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది..? అన్న విష‌యాలు తెలియాలంటే అల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత జంట‌గా ప్ర‌స్తుతం ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

నిన్ను కోరి, మజిలీ వంటి అంద‌మైన ప్రేమ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను చేరువైన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ క‌లిసి నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌లో క‌నిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవ‌లె కశ్మీర్ లో మొద‌లైంది.

అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న అనంత‌రం.. హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పిలలో మిగతా షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొర‌క‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత మ‌రియు వెన్నెల కిశోర్‌లు క‌లిసి ఓ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఈ ఆట‌లో స‌మంత విన్ అయింది.

అంతేకాదు, ఈ విజయాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకున్న సామ్‌.. `విజయ్‌ దేవరకొండ లాంటి ప్రత్యర్థులపై విక్టరీ సాధించడం ఎంతో హ్యాపీగా ఉంది` అని పేర్కొంది. దీంతో సామ్ పోస్ట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘యుద్దం ప్రకటిస్తున్నా.. ఇకపై ప్రతి విక్టరీ రికార్డు అవుతుంది` అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. మొత్తానికి వీరిద్ద‌రి పోస్ట్‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

Acharya: మెగా ఫాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసేనా..!

GRK

Radhey Shyam: పూజా హెగ్డేతో లిప్ లాక్ గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

sekhar

బిగ్ బాస్ 4 : తనకి టైటిల్ దక్కకూడదని ప్లాన్ చేసిన బిగ్ బాస్?

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar