న్యూస్ సినిమా

Vijay Devarakonda: పూరి కోసం శివ నిర్వాణకు కండీషన్స్..?

Share

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం లో ఇటీవల ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న ‘లైగర్’ షూటింగ్ పూర్తవడంతో కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే మరోసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ‘జనగణమనా సినిమాని ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే విజయ్ తాజాగా ఇంకో చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

vijay-devarakonda-insists shiva nirvana to complete the movie fast
vijay-devarakonda-insists shiva nirvana to complete the movie fast

శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం హీరో విజయ్ దేవరకొండ ఈ శనివారం కశ్మీర్ వెళ్ళారు. హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు విజయ్. ప్రస్తుతం ఇవి నెట్టింట హల్ చేస్తున్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు దర్శకుడు శివ నిర్వాణకు విజయ్ కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పాడట.

Vijay Devarakonda: అటు సమంత, ఇటు విజయ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్

ఈ ఏడాది ఆగస్టులో లైగర్ సినిమా వస్తోంది. వాస్తవంగా ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. కానీ, కరోనా పాండమిక్ కారణంగా కుదరలేదు. ఇక జనగణమన చిత్రాన్ని కూడా పూరి త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే, విజయ్..మైత్రీ వారికి – శివకు ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేయమని చెప్పాడట. ఈ క్రమంలోనే శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ – సమంతల సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి అటు సమంత, ఇటు విజయ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి.


Share

Related posts

Eesha Rebba Beautiful Images

Gallery Desk

Guppedentha manasu Jan6 Episode: క్లాస్ లో స్టూడెంట్స్ ముందు వసుకు రోమియో జూలీయేట్ బుక్ ఇచ్చిన రిషి…అ తరువాత ఎలా కవర్ చేసాడంటే..?

Ram

కేసీఆర్ దొరికిపోయాడా …. ప్ర‌త్య‌ర్థులే వ‌ల వేస్తున్నారా?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar