ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ విజయ దేవరకొండ ఇద్దరు మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాలలో విజయ్ దేవరకొండ నీ బన్నీ సపోర్ట్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ కి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు కూడా బన్నీ హాజరయ్యారు. ఈ ఇద్దరు హీరోలకు సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ప్రారంభంలో విజయ్ దేవరకొండ అత్యధిక ఫాలో అవర్స్ కలిగిన తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత బన్నీ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమాతో.. ఇంస్టాగ్రామ్ తన ఫాలోవర్స్ పెరిగే దిశగా పరిస్థితి మారింది.
విజయ్ దేవరకొండ కోసం “పోకిరి” ఫైట్ ప్లాన్ వేసిన పూరి జగన్నాథ్..??
అనంతరం “పుష్ప” సినిమా రిలీజ్ అయ్యి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ని ఫాలోవర్స్ విషయంలో బన్నీ దాటేశాడు. ప్రస్తుతం బన్నీకి 18 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్: అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉందట. దీంతో “లైగర్” రిలీజ్ అయ్యే టయానికి… బన్నీ ఫాలోవర్స్ విజయ్ దేవరకొండ దాటే అవకాశం ఉందని అంటున్నారు.
ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా నేపథ్యంలో…. సినిమా చేస్తూ ఉండటంతో.. సినిమా హిట్టు పడిందంటే.. కచ్చితంగా లెక్కలు మారుతాయి అని అంటున్నారు. ఇంటర్నేషనల్ బాక్సర్ గా “లైగర్” లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఉండటంతో…పాటు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైశాన్ కూడా నటిస్తుండటంతో.. విజయ్ దేవరకొండ కి వరల్డ్ వైడ్ ఇమేజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయంలో వెనకబడి పోయిన విజయ్ దేవరకొండ త్వరలో పుంజుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.