విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి స్వింగ్ లో వున్నాడు. అర్జున్ రెడ్డి పుణ్యమాని మనోడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. పూరి-విజయ్ కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా రిలీజుకి సన్నాహాలు చేసుకుంటోంది. ఇటీవల రిలీజైన విజయ్ న్యూడ్ ఫోటో సినిమాపైన విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఇకపోతే తాజాగా విజయ్ తన ఇన్స్టా సాక్షిగా 16 మిలియన్ల క్లబ్ లో చేరాడు. ఇది అతగాడి రేంజ్ ని తెలియజేస్తుంది. నేటితరం హీరోల్లో ఎవరికీ లేనంత గా కోటిన్నర మంది పైగా ఫాలోవర్స్ తో అతడు సంచలనంగా మారాడు.
ఆమె ఈవిడేనా?
ఇకపోతే రౌడీ బోయ్ గా మగువల మనసులను దోచిన దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా తన లక్ ని పరీక్షించుకోనున్నారు. రౌడీ బోయ్ త్వరలో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో సందడి చేయబోతున్నాడు. ఇంతలోనే దేవరకొండతో డేటింగ్ చేయాలనుందన్న సారా అలీ ఖాన్ ‘కాఫీ విత్ కరణ్ షో’లో వ్యాఖ్యానించడం ఇపుడు ఈ చర్చకు దారితీసింది. దాంతో అందరికీ ఆమెమీదకి ఫోకస్ వెళ్ళింది. అయితే వారు ఎక్కడా అలా అని చెప్పిన దాఖలాలు లేవు. కానీ నిప్పులేనిదే పొగ రాదుకదా అని అంటున్నారు కొంతమంది కుహనా మేధావులు.
ఈమెనే అని అందరు అనుకుంటున్నారు?
అయితే ఆమె రిప్లై కి విజయ్ స్పందించిన తీరు గురించి అందరికీ తెలిసినదే. ఎంతో పరిపక్వతతో స్పందించినా కానీ… అభిమానులు మాత్రం తనలోని ప్రేమను దాచుకోలేకపోయాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సారాతో విజయ్ ఎంతో స్నేహంగా ఉంటున్నాడు. ఈమధ్య ముంబయ్ విధులలో వారు తరచూ కనబడుతున్నట్టు అక్కడి కెమెరాలకు కూడా చిక్కారు. దాంతో తాజా ఘటన మూలంగా వారిని అందరు అలా అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా తరచుగా కలిసి కనిపించారు కానీ వారు నిజంగా డేటింగ్ చేస్తున్నారో లేదో వారు ఎప్పుడూ వెల్లడించకపోవడం గమనార్హం.