Vijay Deverakonda: వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన “లైగార్”తో మరో పరాజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఏకంగా ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడి ఇంకా బాడీ వర్కౌట్స్ చేసి కఠోరంగా శ్రమ పడిన విజయ్ దేవరకొండ.. సినిమా రిజల్ట్ విషయంలో చాలా కృంగిపోవడం జరిగింది. సినిమాలో హీరోగా న్యాయం చేసిన విజయ్ దేవరకొండ దర్శకుడిగా పూరి ఏమాత్రం తన మార్కు చూపించలేకపోయాడు.
విజయ్ దేవరకొండ పడిన కష్టం తెరపై కనబడిన్న గాని దర్శకుడిగా పూరి జగన్నాథ్ పెన్ పవర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ దెబ్బతో పూరి దర్శకత్వంలో ఆల్రెడీ చేస్తున్న “జనగణమన” ప్రాజెక్ట్ ఆపేయటం తెలిసిందే. కాగా ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయ్ మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయటానికి రెడీ అయినట్లు ఇటీవల స్క్రిప్ట్ వినిపించినట్లు టాక్. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ తో చేయబోయే “భగత్ సింగ్ భావదీయుడు” కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఒకవేల ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే వెంటనే హరీష్ … విజయ్ దేవరకొండ సినిమా లైన్ లో పెట్టనున్నట్లు టాక్. “లైగర్” డిజాస్టర్ అయిన తర్వాత.. ప్రాజెక్టులు ఒప్పుకోవటంలో విజయ్ తాజా పరిణామాలు బట్టి స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!