NewsOrbit
Telugu Cinema సినిమా

నిజమైన ప్రేమ అంటే ఇదే అంటున్న విజయ్ దేవరకొండ..!

హీరో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉంటాడు. అతను ఏ సోషల్ మీడియా లేదా పబ్లిక్ ప్లాట్ ఫారమ్ లలో దాని గురించి బహిరంగంగా మాట్లాడడు.. ఇటీవల ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ప్రేమ జీవతం, సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాడు. ప్రేమలో ఉండటాన్ని ఇష్టపడతానని, కానీ, ఐ లవ్ యు టూ అని ఎవరికీ చెప్పలేదని అన్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే విజయ్ వాటిని అంగీకరించలేదు.

విజయ్ దేవరకొండ సుదీర్ఘకాలం తన లేడీ లవ్ తో సంబంధంలో ఉన్నట్లు తెలిపాడు. ఇటీవల ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తన తండ్రి నేర్పిన పాఠం ఏంటో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.. తన చిన్నతనంలో తన తండ్రి ప్రేమ కంటే డబ్బు ముఖ్యమైందని నేర్పించాడని తెలిపాడు. అప్పటి నుంచి డబ్బే ఈ ప్రపంచానికి కేంద్రం అని నమ్ముతూ వచ్చానని అన్నాడు. డబ్బే సర్వస్వం అని, డబ్బు ఉంటేనే మనకు ప్రతి ఒక్కటి దక్కుతుందని, డబ్బు ఉంటేనే ప్రజలు నిన్ను ప్రేమిస్తారని, గౌరవిస్తారని తన తండ్రి చెప్పారుని తెలిపాడు. తన తండ్రి మాటలు ఎంత నాటుకుపోయాయంటే.. పెద్దయ్యాక తనకు సంబంధాలపై నమ్మకం లేదన్నాడు. తన దగ్గరికి వచ్చేవారంతా కోరికతో వచ్చారని నమ్మేవాడినని అన్నాడు. ఎవరైనా తనను ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు తాను ఎప్పుడూ వారిని ప్రేమిస్తున్నానని చెప్పలేదన్నాడు.

అయితే తన ప్రేమ ఆలోచనను తన గర్ల్ ఫ్రెండ్ మార్చిందన్నాడు. అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ పేరును విజయ్ దేవరకొండ ప్రస్తావించలేదు. నడుటయ్యాక తనకు ప్రేమ గురించి చాలా నేర్పిన ఒక సంబంధం ఉందన్నాడు. ప్రేమ కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు విచారం వ్యక్తం చేశాడు. ఏ స్వార్థం లేకుండా కూడా ఎవరైనా ప్రేమిస్తారని గ్రహించానని చెప్పాడు. తన తండ్రి నేర్పిన పాఠం తప్పని తెలుసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందన్నాడు. తన తండ్రి నేర్పిన పాఠం తప్పని, అయితే ఆ పాఠమే తనను ఈ స్థాయికి చేర్చిందని తెలిపాడు. తాను కోరుకున్నది సాధించానని అన్నాడు..

తన గర్ల్ ఫ్రెండ్ తో సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఈక్రమంలో స్నేహితులను, సంబంధాలను కోల్పోయానని అన్నాడు. చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నాడు. ఇతర విషయాలలో స్వేచ్ఛ లేదని, లక్ష్యంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. ఏమీ లేని దశ నుంచి నటుడు కావాలనుకున్నప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా పూర్తి ఫోకస్ పెట్టాలన్నాడు.

కాగా, విజయ్ దేవరకొండ 2018లో తన బెల్జియం గర్ల్ ఫ్రెండ్ విరిజిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు అభిమానులు ఊహిస్తున్నారు. అంతేకాదు ఆమెతో విజయ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం గమనార్హం..అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఆమె పేరును వెల్లడించలేదు.. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri