Vijay devarakonda : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్… పూరి జగన్నాథ్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ రాకముందు దాదాపు సినిమాకి సంబంధించిన షూటింగ్ 40 శాతం పూర్తి అయిపోయింది. అయితే మధ్యలో కరోనా వైరస్ రావడం లాక్డౌన్ దెబ్బకి షూటింగ్ మొత్తం ఆగిపోవటంతో దాదాపు డిసెంబర్ సగం వరకూ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాలేదు.
Vijay devarakonda “లైగర్” బ్యాలెన్స్ షూటింగ్
కానీ ఇటీవల మళ్లీ స్టార్ట్ చేయటంతో.. “లైగర్” బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా కాని చేస్తున్నాడు డైరెక్టర్ పూరి. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ కి హీరో విజయ్ దేవరకొండ సరికొత్త సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే హిందీ “లైగర్” డబ్బింగ్ తన క్యారెక్టర్ కి తానే చెప్పుకోవడానికి..ఈ రౌడీ బాయ్ రెడీ అయినట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ కెరియర్ చాలా డిజాస్టర్ లో ఉంది. ఇలాంటి తరుణంలో “లైగర్” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.
అంతే కాకుండా ఈ సినిమా విషయంలో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తన కెరియర్ లో ది బెస్ట్ మూవీ “లైగర్” అని సోషల్ మీడియాలో అప్పట్లో పోస్ట్ పెట్టడం తో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న ఇటీవల తెలపడంతో.. షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్లు సమాచారం. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ అదేవిధంగా స్ట్రీట్ రౌడీ ఫైటర్ గా కనిపించనున్నట్లు ఫిలిం వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది.