Kushi: విజయం కోసం మంచి ఆకలి మీద ఉన్న హీరో విజయ్ దేవరకొండకి ఖుషి రూపంలో హిట్ పడిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కాగా విజయ్ దేవరకొండ కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. సింపుల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఖుషి.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. మొదటి మూడు రోజులకే 70 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా విజయంతో వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సంచలన స్పీచ్ ఇచ్చారు. తన సినిమాలపై సోషల్ మీడియాలో నెగెటివిటీ క్రియేట్ చేయడానికి కొంతమంది డబ్బులు ఇచ్చి బయట వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. ఎన్నో ఫేక్ రేటింగ్స్ వచ్చాయి.
ముఖ్యంగా యూట్యూబ్ ఫేక్ రివ్యూలను దాటుకుని ఖుషి సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. అందుకు కారణం నా అభిమానులే. నీ ప్రేమే మీరు ఇచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరోత్సాహపరచడం ఇష్టం లేదు. వాటి సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమాతో మీ ముఖాల్లో నవ్వు చూడాలనుకున్న కోరిక తీరింది. ఇక ఇదే సమయంలో తన సంపాదనలో అభిమానులకు భాగం ఉందంటూ వారికోసం కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. తన ఎదుగుదలలో అభిమానుల పాత్ర ప్రాముఖ్యమైనదని స్టేజి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం తన ఆదాయంలో కోటి రూపాయలు అభిమానుల కోసం ఖర్చు పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
తన అభిమానులలో 100 మంది పేద కుటుంబాలను ఎంపిక చేసి వారి కుటుంబాలకు తన లక్ష రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ ప్రకటనతో తల్లి షాక్ అయ్యిందట. పేద కుటుంబాల విషయంలో తన సంపాదనను భాగము ఇవ్వటం పట్ల విజయ్ దేవరకొండ తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిచ్చిందంట. అంత మంచి కొడుకు తనకు పుట్టడం నిజంగా తాను చేసుకున్న అదృష్టమని విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె భౌగోద్వేగానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.