Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” పరాజయం పాలయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. వరుసపరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడ్డాడు. కానీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోండి. “లైగర్” కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. ఫస్ట్ టైం అటు పూరి జగన్నాథ్ ఇటు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా నేపథ్యంలో “లైగర్” ద్వారా ఎంట్రీ ఇవ్వగా పరాజయం పాలయ్యింది.
“లైగర్” పరాజయం పాలు కావడంతో హీరో విజయ్ దేవరకొండ చాలా బాధపడ్డాడు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎంతో నిరాశ చెందారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హిట్లు అందించిన పూరి జగన్నాథ్.. తమ అభిమాన హీరోకి కూడా మర్చిపోలేని హిట్ ఇస్తాడని భావించారు. కానీ “లైగర్” పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా విడుదల ఈ దాదాపు ఎడాది కావస్తున్న క్రమంలో “లైగర్” పరాజయం పాలు కావటం పట్ల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “లైగర్ లో అన్నయ్య విజయ్ దేవరకొండ పాత్రకి నత్తి ఉండటం చాలా మందికి నచ్చలేదు.
సినిమా ఫ్లాప్ అవ్వటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ “లైగర్” కోసం అన్నయ్య విజయ్ దేవరకొండ శారీరకంగా అదే విధంగా మానసికంగా ఎంతో కష్టపడ్డాడు. కానీ మార్నింగ్ షో సమయంలోనే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది అంటూ ఆనంద్ దేవరకొండ తెలియజేశారు. ప్రస్తుతం “బేబీ” అనే సినిమా ఆనంద్ చేయడం జరిగింది. ఈ సినిమా ఈనెల 14వ తారీకు విడుదల కాబోతోంది.