60 రోజులు ఒకే చోట చేశారా?

Share

ఒక సినిమాతో విజయ్ దేవరకొండ లైఫ్ స్టైయిలే మారిపోయింది. పెళ్లి చూపులు సినిమాతో తన యాక్టింగ్‌ని ఫ్రూవ్ చేసుకున్నా ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో జీవించేశాడు.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో విజయ్ క్రేజీ హీరో అయ్యాడు. దీంతో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ గీతగోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇటీవలే వచ్చిన టాక్సీవాలాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నా ఈ హీరోతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కడుతున్నారు.

వరుస సినిమాలతో రెండు మూడేళ్ళు డైరీ ఫుల్ చేసుకున్న ఈ రౌడీ హీరో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నడట. ఓ లక్ష్యం కోసం పోరాడే యువకుడి పాత్రలో విజయ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.ఇందులో విజయ్‌కి జోడీ రష్మిక మండన్న క్రికెటర్ పాత్రలో కనిపించనుందట… మరోసారి ఈ జంట మ్యాజిక్ చేయబోతుంది అంటున్నారు చిత్రటీమ్.

ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రీసెంట్ గా కాకినాడలోని ఓ మెడికల్ కాలేజీలో షూటింగ్ జరుపుకుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఈ పెద్ద షెడ్యూల్ లో విజయ్ కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలతో పాటు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా విజయ్ మారే సీన్స్ కూడా తెరకెక్కించారు. అర్జున్ రెడ్డిలో డాక్టర్ పాత్రలో నటించిన విజయ్, డియర్ కామ్రేడ్ సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయి భారీ హిట్‌గా నిలుస్తోందేమో అలాగే గీత గోవిందం లాంటి సూపర్ హిట్ లో నటించిన రష్మిక కూడా డియర్ కామ్రేడ్ లో ఉంది కాబట్టి ఎటు చూసిన ఈ సినిమాలో అన్నీ ప్లస్ లే కనిపిస్తున్నాయి. మరి ఇన్ని సెంటిమెంట్స్ తో వస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాతో మరో హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి.


Share

Related posts

Naa Ventapaduthunna Chinnadevademma: “నా వెంటపడుతున్న చిన్నాడేవడెమ్మా” ఫస్ట్ లుక్..

bharani jella

Anjali Cute Images

Gallery Desk

PK Sequel : అమీర్ ఖాన్ పీకే కు సీక్వెల్ రాబోతోందా… దర్శకుడు ఏమంటున్నాడు..?

Teja

Leave a Comment