‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సూపర్ హిట్ అందుకోని అతి తక్కువ కాలంలోనే నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలకి అందనంత ఇమేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ రౌడీ హీరో, ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అవ్వడంతో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రతి సినిమాకి వేరియేషన్స్ చూపిస్తున్న విజయ్, క్రాంతి మాధవ్ సినిమాలో కూడా విభిన్నమైన పాత్ర పోషిస్తూ సింగరేణి కార్మిక నాయకుడిగా – కాస్త ఏజ్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఏజ్డ్ పాత్రలో కనిపించబోతున్న విజయ్ దేవరకొండ 8 ఏళ్ల బాబుకు తండ్రిగా నటించనున్నాడు. చిన్న వయసులోనే విజయ్ తండ్రి పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే క్రాంతి మాధవ్ చెప్పిన కథలో చాలా విషయం ఉండి ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ పక్కన రాశి ఖన్నా – ఐశ్వర్య రాజేష్ – ఇసబెల్లా – కేథరిన్ తెర్సా హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ నలుగురిలో విజయ్ ఎవరితో రొమాన్స్ చేయనున్నాడు, మెయిన్ ఫీమేల్ లీడ్ ఎవరు అనే విషయంపై కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే భారీ రిస్క్ చేసిన విజయ్ దేవరకొండ నమ్మకాన్ని క్రాంతి మాధవ్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి
previous post