యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అర్జున్ రెడ్డి హిట్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్, గీత గోవిందం మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. దీని తరువాత వచ్చిన బైలింగ్వల్ మూవీ నోటా ప్లాప్ అయినా తమిళ్లో విజయ్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. నోటా రూపంలో వచ్చిన ప్లాప్ ని ఆ వెంటనే టాక్సీవాలాతో లెక్క సరి చేసిన ఈ రౌడీ హీరోతో సినిమాలు చెయ్యడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాలో విజయ్‌కి జంటగా నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. వాళ్లలో రాశి ఖన్నా, కాథెరిన్ థెరిసా ఇప్పటికే ఫైనల్ కాగా మరో ఇద్దరు భామలని వెతికే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా హిట్ అయితే విజయ్ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోవడం ఖాయమని సినీ అభిమానులు అంటున్నారు.