Vijay Deverakonda: ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9వ తారీఖున రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా అప్పట్లో రావడం జరిగింది. ఇదిలా ఉంటే సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయక ముందే మరో రెండు సినిమాలు విజయ్ దేవరకొండ రీసెంట్ గా లైన్లో పెట్టినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతుంది. మేటర్ లోకి వెళ్తే ఓ కొత్త డైరెక్టర్, శివ అనే డైరెక్టర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్టు సమాచారం.
ప్రస్తుతం సుకుమార్ బన్నీతో చేస్తున్న “పుష్ప” రెండు పార్టులుగా వచ్చే అవకాశం ఉండటంతో .. సమయం పట్టే పరిస్థితి నెలకొనడంతో విజయ్ దేవరకొండ .. సుక్కుతో సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయాలని.. స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినపడుతోంది. అతి తక్కువ టైమ్ లోనే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ లోపు సుకుమార్ పుష్ప రెండు భాగాలుగా చిత్రీకరించే పరిస్థితి ఉండటంతో వెంటనే తర్వాత .. సుకుమార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని విజయదేవరకొండ అనుకుంటున్నాడు అని ఫిల్మ్ నగర్ టాక్.