NewsOrbit
Entertainment News సినిమా

Kushi: OTTలో విజయ్ దేవరకొండ సమంతల “ఖుషీ” సినిమా – ఫుల్ డీటైల్స్ !

Share

Kushi: సమంత, విజయ్ దేవరకొండ నటించిన “ఖుషీ” సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ రికార్డు స్థాయి వసూలు రాబడుతుంది. సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఇంకా మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండ “ఖుషీ” తో హిట్ అందుకోవటంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. సినిమా విడుదల అవ్వకముందే పాటలతో సగం హిట్ అయింది.

Vijay Deverakonda Samantha Kushi Movie in OTT Full Details

ఇక విడుదలైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మొత్తం చూసే రీతిలో.. లవ్ స్టోరీల స్పెషలిస్ట్ శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా “ఖుషీ” ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా థియేటర్ లో పూర్తిగా రన్ అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. “ఖుషీ” తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. అన్నిచోట్ల భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడం జరిగింది.

Vijay Deverakonda Samantha Kushi Movie in OTT Full Details

దీంతో సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. మొదటిరోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు మీడియా సమావేశం పెట్టి తెలియజేశారు. చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండ హిట్ అందుకోవటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. దీంతో దాదాపు రెండు మూడు వారాలు పాటు “ఖుషీ” ప్రభంజనం బాక్స్ ఆఫీస్ వద్ద ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Share

Related posts

త‌న‌తో డేటింగ్ చేయ‌లేదు…

Siva Prasad

బిగ్ బాస్ 4: ఫస్ట్  టైం అభిజిత్ పై సెటైర్లు పడుతున్నాయి..!!

sekhar

Alia Bhatt: ఖరీదైన రింగ్‌తో ఆలియాకి రణ్‌బీర్‌ మ్యారేజ్ ప్రపోజల్‌.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో..!

Ram