Vijay Deverakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ ఖచ్చితంగా తనని హిట్ ట్రాక్ ఎక్కిస్తాడు అన్న ధీమాతో ఉన్నాడు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా స్టైల్ లో తెరకెక్కుతున్న ఉండటంతో ప్రతి సన్నివేశం విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
అంతకు ముందు విజయ్ దేవరకొండ పరిస్థితి లోనే ఉన్న హీరో రామ్ ని “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కించడం తో .. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు అంచనాలు భారీ రేంజ్ లో పెట్టుకున్నారు. పైగా పూరీ జగన్నాథ్ “లైగర్” తన కెరియర్ లోనే చాలా స్పెషల్ సినిమా అని చెప్పటంతో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాతలలో ఛార్మి కూడా ఒకరని అందరికీ తెలుసు.
ఈ సందర్భంగా ఇటీవల చార్మి పుట్టినరోజు కావడంతో ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. పూలతో కూడిన బాక్సులు అందులో గిఫ్ట్ లు ఉండటం జరిగింది . ఛార్మి తాజాగా ఈ గిఫ్ట్ విజయ్ దేవరకొండ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందులో ఏముందో అని నెటిజన్లు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. 15 సంవత్సరాల వయసులోనే ఛార్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టి .. తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ ని సంపాదించింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో అనేకమంది టాప్ హీరోలతో నటించి.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా రాణిస్తోంది.