సినిమా

Vijay Deverakonda: షాహిద్ “కబీర్ సింగ్” పై విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్..!!

Share

Vijay Deverakonda: రౌడీ విజయ్ దేవరకొండ నీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చేసిన సినిమా “అర్జున్ రెడ్డి”. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా … 2017 సంవత్సరంలో రిలీజ్ అయ్యి యువతను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ లోని మాస్ యాంగిల్.. సరికొత్తగా ప్రొఫెషనల్ గా.. డాక్టర్ పాత్రలో చూపించడం జరిగింది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా.. బాగా వర్కౌట్ అయింది. అయితే ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా… షాహిద్ కపూర్ తో “కబీర్ సింగ్” గా తెరకెక్కించడం జరిగింది.

vijay deverakonda viral commenys on hindi kabir singh

వరస ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్.. ఈ సినిమాతో బాలీవుడ్ లో మళ్లీ పుంజుకున్నాడు. షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి తాజాగా విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్ చేశారు. అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ “కబీర్ సింగ్” సినిమా ఇప్పటి వరకు చూడలేదు అని స్పష్టం చేశారు. తన సినిమాకి సంబంధించి కొన్ని రివ్యూస్ లో… షాహిద్ కపూర్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అని తెలుసుకున్నాను విజయ్ దేవరకొండ.. చెప్పుకొచ్చరు. దీంతో విజయ్ దేవరకొండ కామెంట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

ఇటీవల హిందీ భాషకు సంబంధించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరో తక్కువ చేసి కామెంట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో మహేష్ బాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్లు చేసినటు.. లైట్ తీసుకున్నట్టు.. ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ సినిమా చూడలేదని.. చెప్పడం బాలీవుడ్ మీడియా ఈ వ్యాఖ్యలను పెద్దది చేసి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు బాలీవుడ్ లో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. దీంతో ఈ అక్కసుతో బాలీవుడ్ మీడియా సౌత్ ఫిలిం ఇండస్ట్రీనీ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాట్లూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Share

Related posts

Chiranjeevi: ఆ పదవి నాకు వద్దు పంచాయతీలు వద్దు అంటున్న చిరు…?

amrutha

Tamannah Bhatia Traditional Looks

Gallery Desk

చిరు కి చిన్న పాత్ర ఇచ్చిందా.. కూతురని ఒప్పుకున్నట్టున్నారు ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar