Leo Movie Review: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా అక్టోబర్ 19 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.
సినిమా పేరు: లియో
నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మడోన్నా, సెబాస్టియన్ తదితరులు.
సంగీతం: అనిరుద్
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పలని స్వామి
విడుదల తేదీ: 19-10-2023.
పరిచయం:
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే తమిళ హీరో దళపతి విజయ్ ఇటీవల వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతంలో విజయ్ “మాస్టర్” సినిమా చేసి అద్భుతమైన హిట్ సొంతం చేసుకున్నాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో “లియో” తెరకెక్కింది. దీంతో భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19 వ తారీకు సినిమా విడుదల కావడం జరిగింది. మరి “లియో” సినిమా ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం.
స్టోరీ:
పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో తన భార్య (త్రిష) ఇద్దరు పిల్లలతో కలిసి ఒక కాఫీ షాప్ నడుపుతూ సాధారణ జీవితం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓసారి ఆ కాఫీ షాప్ కు.. కొంతమంది రౌడీలు వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేయగా వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో పార్తిబన్ అందరిని కాల్చి చంపేస్తాడు. ఈ గొడవతో పార్తిబన్ అరెస్ట్ అవటం జరుగుద్ది. అయితే ఆత్మరక్షణ కోసమే వారిని చంపినట్లు పార్తిబన్.. న్యాయస్థానంలో చెప్పడంతో… కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్తిబన్ ఫోటో ఒక వార్త పత్రికలో చూసిన ఏపీలోని అంటోనీ దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ కి రావటం జరుగుద్ది. పార్తిబన్ చంపాలని టార్గెట్ తో.. వచ్చి.. ఇక నటించింది చాలు లియో దాస్.. నీ అసలు స్వరూపం బయట పెట్టు బయటికి రా ..నేను నీ తండ్రిని అంటోనీ దాస్..పార్తిబన్ ఇంటి వద్ద షాకింగ్ డైలాగులు వేస్తాడు. ఇంతకీ అంటోనీ దాస్.. లియో దాస్ మధ్య.. జరిగిన గొడవ ఏమిటి. ఆంటోనీ లియో దాస్ కి ఎలా తండ్రి అవుతాడో.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
చాలా సింపుల్ లైన్ స్టోరీతో గతంలో “భాష” మాదిరిగా.. ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. లోకేష్ కనగరాజ్ తనదైన దర్శకత్వ ప్రతిభతో.. అందమైన లోకేషన్ లతో సినిమాని నడిపించారు. ఫస్ట్ ఆఫ్ లో ట్విస్టులు పరవాలేదు అనిపిస్తాయి. కానీ సెకండాఫ్ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలు చూసే ప్రేక్షకులు సహనాన్ని పరీక్షకు గురి చేసినట్లు ఉంటాయి. యాక్షన్ ఎలిమెంట్స్ భారీ స్థాయిలో ఉన్న దానికి తగ్గ ఎమోషనల్ టచ్ లోకేష్ మిస్సయిడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్ర కాస్త సెంటిమెంటల్ గా కనబడి.. ఏదో ట్విస్ట్ ఉంటదని అనుకుంటున్న సమయంలో సదాసీదుగా కొనసాగుద్ది. ఫ్లాష్ బ్యాక్ మరియు కుటుంబ సంబంధాలు ఏమిటో సరిగ్గా వివరించలేకపోయాడు. 45 ఏళ్ల పాత్రలో విజయ్ నటన చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. సంగీత దర్శకుడు అనిరుద్ యధావిధిగా సినిమాకి న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ మరియు యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ మాదిరిగా సెకండ్ హాఫ్ లో సినిమాని నడిపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్ వీక్ స్టోరీ లైన్ రాసుకున్నట్లు సినిమా చూస్తే అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మరీ బోర్ కొట్టేస్తాయి. విజయ్ అభిమానులకు..నచ్చే సినిమా. “మాస్టర్” లాగా కమర్షియల్ గా ఆకట్టుకుంటది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా అని వెళ్తే.. నిరుత్సాహం చెందే అవకాశం ఎక్కువ. హీరోయిన్ త్రిష.. చాలా అద్భుతంగా తెరపై నిండుగా కనిపించింది. మిగతా పాత్రలు అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీన తమ పరిధి మేరకు మెట్టించారు. లోకేష్ విక్రమ్, ఖైదీ మాదిరిగా లియో మెప్పించలేకపోయాడు. యూత్ నీ ఆకట్టుకునే ఎలిమెంట్స్.. సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.