మక్కల్ సెల్వన్ గా కోలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా సైరా సినిమా నుంచి అతని లుక్ రివీల్ చేశారు. రాజా పాండి పాత్రలో కత్తి పట్టుకొని, జులపాల జుట్టుతో విజయ్ సేతుపతి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి లాంటి నటుడు సైరా సినిమాలో ఉండడం వలన కోలీవుడ్ లో సైరా మార్కెట్ మరింత పెరుగుతుంది.
previous post