NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

Vijay Sethupathi : థియేటర్లో లెక్కలు రాసుకుంటూ – ఉత్తమ నటుడిగా..! సింగిల్ టేక్, సింగిల్ షాట్..!!

Vijay Sethupathi : Life Story backgroud

Vijay Sethupathi : అది ఓ తెలుగు సినిమా షూటింగ్ మొదటి రోజు … ఆ సినిమాకు నెగిటివ్ పాత్రలో ఓ నటుడ్ని తీసుకున్నారు. అతనితో కలిసి పని చేయడం ఆ దర్శకుడికి, నిర్మాతలకు, సహా నటులకు అదే మొదటిసారి..!
సీన్ : సముద్రం ఒడ్డున టీ తాగుతూ.., టీ లో తీయదనం ఎక్కువైనా దాన్ని మేనేజ్ చేసేలా పంచదార నోట్లో వేసుకునే ఓ ప్రత్యేకమైన సీన్ అది. ఓ రకమైన హావభావాలు పలికించాలి. షూటింగ్ మొదటి రోజు. నటులు కొత్త. దర్శకుడు కొత్త. సీన్ బాగా వస్తేనే అందరిలో సానుకూలత నాటుకుంటుంది. ఆ నటుడు పరభాషీ. తెలుగు రాదు. అతనికి సీన్ చెప్పారు. అతను ఒకే. వెంటనే చేసేస్తా అన్నారు. అందరూ లైట్ తీసుకున్నారు. నటుడు సీన్ లోకి వచ్చారు. కెమెరా ఆన్ అయింది. ఎస్… ఎవరూ ఊహించనిదే.., ఆ నటుడు సింగిల్ టేక్ లో.., సింగిల్ షాట్ లో ఒకే మాటతో.. దర్శకుడు అనుకున్న కంటే బాగా హావభావాలు పలికించి సీన్ పండించారు. ఆ నటుడే విజయ్ సేతుపతి.. ఆ సినిమా ఉప్పెన..!!

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi Life Story backgroud

బిల్డప్ ఉండదు. భారీ డైలాగు ఉండదు. వెనుక మ్యూజిక్ పెద్దగా ఉండదు. హడావిడి ఏమి ఉండదు. అంతా సింపుల్ గా సైలెంట్ గా… కేవలం ముఖంలో హావభావాలతోనే సీన్ ని ప్రేక్షకులకు చూపించే అతి కొద్దిమంది నటుల్లో ఈయన ఒకరు..! విజయ్ సేతుపతి గురించి చెప్పుకోవాలంటే పైన ఒక ఉదాహరణ మాత్రమే. ఎక్కడైనా.., ఎప్పుడైనా, ఎంత కఠినమైన సీన్ అయినా… సులువుగా, సింగిల్ టేక్ లో చేసెయ్యడమే అతని ప్రత్యేకత. ఉప్పెన షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు విజయ్ సేతుపతి నటన చూసి డైరెక్టర్, నిర్మాతలు కూడా ముగ్ధులయ్యారంటే.. అతని గురించి చెప్పుకోవచ్చు..!! తొమ్మిదేళ్ల కిందట పిజ్జా సినిమాలో లేత కుర్ర హీరో.., మూడేళ్ళ కిందట 1996 అనే చిత్రంలో ప్రేమ విఫలైన హీరో.., ఏ ఏడాది సంక్రాంతికి వచ్చిన మాస్టర్ చిత్రంలో విలన్. ఉప్పెనలో పరువు కోసం, కులం కోసం తాపత్రయపడే తండ్రి. పాత్ర ఏదైనా.. సులువుగా చేసుకుంటూ తన నట జీవితంలో అనేక మలుపులు చూపిస్తున్న విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇదీ చదవండి : మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యే”కథ”లు తెలుసా..!?

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi Life Story backgroud

Vijay Sethupathi : ఖాతా పుస్తకాలు రాసుకుంటూ… నటుడిగా..!!

నిజానికి విజయ్ సేతుపతికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆయన వారసత్వ నటుడు కాదు. బీకామ్ వరకు చదివారు. ఇరవై ఏళ్ళ కిందట చెన్నైలోని ఓ సినిమా థియేటర్లో అకౌంటెంట్ గా చేరారు. మూడేళ్లు అలా పని చేస్తూనే.. ఆ థియేటర్లోనే ప్రతీ సినిమాని చూస్తూ.. నటనపై ఆసక్తి పెంచుకున్నారు. తనలోని ప్రతిభని సానపెట్టారు. ఈ క్రమంలోనే థియేటర్ యజమాని ద్వారా డిస్ట్రిబ్యూటర్ తద్వారా ఓ చిన్న నిర్మాత వద్దకు వెళ్లి షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 2006 నుండి సినిమాల్లో మొదలు పెట్టారు. 2010 లో వచ్చిన సుందర పాండియన్.. ఆ తర్వాత వచ్చిన పిజ్జా సినిమాలు విజయ్ కెరీర్ ని మలుపు తిప్పాయి. అతనిలో పరిపూర్ణ నటుడిని బయటకు తెచ్చాయి. ఆ తర్వాతమూడేళ్ళ కిందట సూపర్ డీలక్స్ సినిమాలో ఆయన చేసిన ట్రాన్సజెండర్ పాత్రతో దేశం మొత్తం విజయ్ సేతుపతి గురించి తెలుసుకుంది. ఆయన నట శిఖర ఎత్తు తెలుసుకుంది. ఆ ఏడాదిలోనే 96 చిత్రం ద్వారా మరోసారి ఆయన దేశం మొత్తం తెలిసారు. ఇక ఆయన కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఆయన కాల్ షీట్లు కోసం టాలీవుడ్, కాలీవుడ్ సహా బాలీవుడ్ కూడా వేచి చూస్తుంది.

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi Life Story backgroud

అవార్డుల పంట మామూలుగా లేదు..!!

నటుడికి అవార్డులు కొంత సంతృప్తిని ఇస్తాయి. కానీ విజయ్ సేతుపతికి వరిస్తే ఆ అవార్డుకే విలువ వచ్చినట్టు భావిస్తాయేమో… ఆయనకు ఈ పుష్కర కాలం కెరీర్ లోనే 14 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. మరో 21 అవార్డులకు ఆయన నామినేట్ అయ్యారు. అన్నిటి కంటే ప్రత్యేక విషయం ఏమిటంటే… ఉత్తమ హీరో, ఉత్తమ విలన్, ఉత్తమ నటుడు… ఇలా భిన్నమైన పాత్రల్లో ఒదిగిపోతుండడం.., ఏ పాత్ర అయినా ఈజీగా చేస్తుండడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదేమో..! మరో రెండు దశాబ్దాల పాటూ ఇండియన్ సినిమా విజయ్ సేతుపతి నామస్మరణతో ఉంటుంది అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు..!!

author avatar
Srinivas Manem

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar