పవన్ కోసం రాసుకున్న కథ‌తో ..


ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం రాసుకున్న క‌థ‌తో రూపొందించిన చిత్రం `సంగ త‌మిళ‌న్‌`. ఈ చిత్రాన్ని విజ‌య్ సేతుప‌తి హీరోగా రూపొందించారు. దీన్ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ నెల 15 న విడుదల చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో ‘విజయ్ సేతుపతి’కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ సేతుపతి మూవీ తమిళ, తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతున్న మూవీ ‘విజయ్ సేతుపతి’. తెలుగు నేటివిటీ కి సరిపోయే కథా, కథనాలతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలసి వస్తున్న ఈ చిత్రంలో నాజర్, నివేద పేతురాజ్, అశుతోష్ రాణా లీడ్ రోల్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.