విజయ్ సేతుపతికి ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు, అన్ని భాషల్లోనూ అభిమానులు తయారవుతున్నారు. ఆయన త్వరలో సౌత్ నుంచి బాలీవుడ్‌కి కూడా వెళ్లనున్నారు. ఆమిర్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన ఫ్రెండ్‌గా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్ సింగ్ చద్దా అనే హిందీ చిత్రం తెరకెక్కనుంది. ఫారెస్ట్ గంప్ 1994లో విడుదలైంది. అప్పట్లో టామ్ హాంక్స్, సాల్లీ పీల్డ్ నటించారు. టామ్ హాంక్స్ కి బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ కూడా వచ్చింది. `లాల్ సింగ్ చద్దా`లో బుబ్బా అనే పాత్ర ఉంటుంది. దాన్ని ఇంగ్లిష్ లో మైకెల్టి విల్లియమ్సన్ చేశారు. ఆ పాత్రను ఇప్పుడు విజయ్ సేతుపతి చేయనున్నారు. ఆ పాత్ర తమిళ్లోనే మాట్లాడుతుందన్నమాట. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ `చెన్నై ఎక్స్ ప్రెస్` చేశారు. అక్షయ్‌కుమార్ `ప్యాడ్‌మ్యాన్`తో తమిళనాడు రిలేటెడ్ స్టోరీని టచ్ చేశారు. సో ఇప్పుడు ఆమిర్‌ఖాన్ కూడా సౌత్ వైపు స్నేహంగా చేతులు చాపుతున్నారు. ఏదేమైతేనేం… బాలీవుడ్ ఆర్టిస్టులు తీసుకునే నిర్ణయాల వల్ల దక్షిణాది నటీనటులకు ప్యాన్ఇండియా గుర్తింపు దక్కుతోంది.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!