సూపర్‌స్టార్ మహేష్ `మహర్షి` విడుదల కాకముందే.. తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అనీల్ రావిపూడిఆ దర్శకత్వంలో మహేష్ 26 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. `దూకుడు` సీక్వెల్‌గా `వాట్సాప్` పేరుతో సినిమా తెరకెక్కనుందని వార్తలు వినపడుతున్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కీలకపాత్రల్లో ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులను అనీల్ తీసుకుంటున్నాడట. అందులో ఒకరు కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కాగా.. మరొకరేమో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె మహేష్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేపే విషయమే.
previous post
next post