Vijay – Yash: మూడేళ్ళ తర్వాత ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతు న్నారు ..సక్సెస్ ఎవరిది..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అయితే, అందరూ ఆ ఇద్దరు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అనుకుంటున్నారు. అందుకు కారణం ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అందరూ చరణ్, తారక్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారా అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ, అది కరెక్ట్ కాదు. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించినప్పుడు పోటీ ఎలా అవుతుంది.
ఆ ఇద్దరు హీరోలు పర భాషా హీరోలు. ఒకరు తమిళ స్టార్ విజయ్. మరొక హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. వీరిద్దరి సినిమాలు ఒకే ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తమిళ హీరో విజయ్ గత కొంతకాలంగా వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ క్రేజ్‌తో ఉన్నాడు. చెప్పాలంటే ఇప్పుడు విజయ్ సౌత్‌లోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన నటించిన గత చిత్రం మాస్టర్ భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిది మారన్ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.
Vijay – Yash: బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ 2 ..!
ఇక కన్నడ రాకింగ్ స్టార్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 1 మూవీతో భారీ సక్సెస్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన యష్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు న్నాయి. అయితే, ఏప్రిల్ 1న కేజీఎఫ్ 2 భారీ స్థాయిలో సౌత్ భాషలతో పాటు విదేశాలలో కూడా రిలీజ్ కాబోతోంది. అలాగే, విజయ్ – పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ కూడా పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. మరి బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ 2 అని రిలీజ్ కాబోతున్న వీటిలో ఏ సినిమా వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.