Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన రీసెంట్ మూవీ లైగర్ ప్లాప్ అవడంతో బాగా డిసపాయింట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ బాధ నుంచి బయటికి వచ్చి తన నెక్స్ట్ మూవీ ‘ఖుషి’ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. లైగర్ సినిమా కలెక్షన్స్ రెండో రోజే పడిపోయిన విషయం తెలుసుకున్న విజయ్ జిమ్ కీ వెళ్లి వర్క్ ఔటస్ చేయడం మొదలు పెట్టాడు. అసలైతే లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్, పూరి జగన్నాథ్ కలిసి జనగణమన సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. కానీ లైగర్ ఫ్లాప్‌తో జనగణమన సినిమాని ఆపేశారు.
Vijay Devarakonda: పాపం, విజయ్!
ఖుషి సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా విజయ్ ని కాస్త కన్ఫ్యూషన్లో పడేసింది. శివ నిర్వణ డైరెక్షన్లో వస్తున్న ఖుషి మూవీ షూటింగ్‌ను కశ్మీర్లో పూర్తి చేసుకొని, డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ సమంత అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఖుషి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. సామ్ రీసెంట్గా తాను బయటికి వచ్చే పరిస్థితిలో లేనని చెప్పింది. దీనితో ఆమెతో నైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో ఆశపడిన విజయ్ ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. ‘లైగర్’ సినిమా ప్లాప్‌తో వచ్చిన మచ్చ చెరిపేసి ‘ఖుషి’ సినిమాతో త్వరగా యావరేజ్ హిట్ అయినా కొట్టాలనుకున్నాడు. కానీ సమంత మాయసైటీస్ చికిత్స కే పరిమితమైంది.
నెక్స్ట్ ఏంటి
ఇక సామ్ ఎపుడు కోలుకుంటుందో? ఎపుడు షూటింగ్ కీ వస్తుందో? తెలీదు. విజయ్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. ఇక సినిమా గురించి పక్కన పెట్టి విజయ్ దేవరకొండ కొన్ని యాడ్స్ లో పాల్గొంటూ కొత్త కొత్త మేకోవర్ ఫొటోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. కానీ విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. జనగణమన, ఖుషి సినిమాలు ఉన్నాయ్ కదా అనుకుంటే.. అవేమో అసలు పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. దాంతో అందరూ విజయ్‌ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ అడగడం మొదలు పెట్టారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!