విజ‌య‌శాంతి ..భార‌తి


రాములమ్మ‌గా సినిమా రంగానికి దూర‌మైన లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి భార‌తిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను దీపావళి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సీరియ‌స్‌గా ఎవ‌రికో ఆమె వార్నింగ్ ఇచ్చేలా ఉన్న ఆ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆమెను తెర‌పై చూడ‌టం అద్భుతం అంటూ రానా ద‌గ్గుబాటి కూడా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.
“న‌టిగా ఇంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకోవ‌డం నాకు గొప్ప గౌర‌వం. నా క‌మ్‌బ్యాక్‌కు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం ప‌ట్ల చాలా ఆనందంగాఉంది. ప్రిన్స్ మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డానికి ఎంజాయ్ చేశాను. ఈ జ‌ర్నీ ఓ అసాధార‌ణ అనుభూతి“ అంటూ విజ‌యశాంతి త‌న ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు.