`నాయుడమ్మ` తర్వాత విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోవడానికి అంగీకరించారంటే ఆ పాత్రకున్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్లో ఆమె పాల్గొంటున్న విషయం తెలిసిందే. సరదాగా మేకప్ వేసుకుంటూ, సెట్‌కి వస్తున్న పాత్ర మిత్రులను కలుసుకుంటూ ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఈ సినిమాలో చేస్తున్న పాత్ర ఎలాంటిది? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. `సరిలేరు నీకెవ్వరు`లో ఆమె మెడికల్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నారట. చాలా స్ట్రాంగ్ కేరక్టర్ అని వినికిడి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సినిమాలో చాలా సేపు, విజయశాంతి పాత్ర, మహేష్ పాత్ర ఒకరినొకరు కలుసుకోరట. కానీ విజయశాంతిది విల్లీ తరహా పాత్ర కాదట. మహేష్ కి ఇన్డైరక్ట్ గా సపోర్ట్ చేసే కేరక్టర్లోనే ఆమె ఉంటుందని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, విజయశాంతికి పెద్ద ఫ్యాన్. ఆమెకున్న మాస్ ఫాలోయింగ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని డైలాగులు, కేరక్టర్ రాశారని సమాచారం. మహేష్ సరసన ఈ సినిమాలో రష్మికా మండన్న నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు.
previous post
next post