Breaking: విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) హీరోగా పూరి జగన్నాథ్(Purijagannath) దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్”(Liger) సినిమా నుండి గ్లిమ్ప్స్ రిలీజ్ చేయడం జరిగింది. కొద్ది నిమిషాల ముందు రిలీజ్ అయిన లైగర్ గ్లిమ్ప్స్(Liger Glimpse) అదరగొట్టింది. ఊహించని రీతిలో విజయ్ దేవరకొండ ని చూపించడం జరిగింది. లైగర్ గ్లిమ్ప్స్ బట్టి చూస్తే సినిమాలో విజయ్ దేవరకొండ టీ అమ్ముకున్నే కుర్రవాడిగా ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎదిగిన వాడిగా ముంబై బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ గా పూరి జగన్నాథ్ చూపించడం జరిగింది.
అంతేకాకుండా సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు టీ అమ్ముకునే పాత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తూ లైగర్ గ్లిమ్ప్స్ లో కనిపించడం విశేషం. బాక్సర్ గా చాలా స్టైలిష్ గా విజయ్ దేవరకొండ ని పూరి జగన్నాథ్ చూపించాడు. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ లైగర్ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత పూరి జగన్నాథ్ తో పాటు కరణ్ జోహార్ నిర్మించడం జరిగింది.