NewsOrbit
Entertainment News సినిమా

SSMB29: రాజమౌళి మహేష్ సినిమాపై..అవన్నీ పుకార్లే అంటూ విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

SSMB29: RRR, బాహుబలి సినిమాలతో వరుస పెట్టి ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించడంతో రాజమౌళి స్థాయి పెరిగిపోయింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి కూడా పెరిగింది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిమ్స్ కి ఉన్న డిమాండ్… ఇప్పుడు ఉన్న డిమాండ్ కి పొంతన లేదు. దీనికి ప్రధాన కారణం దక్షిణాది సినిమాలని చెప్పవచ్చు. ఇటీవల దక్షిణాది సినిమాలే ఆస్కార్ అవార్డ్స్ గెలవడంతో… చాలా ప్రాధాన్యత నెలకొంది. భారతీయ చలనచిత్ర రంగంలో “RRR” అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ మహేష్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Vijayendra Prasad's sensational comments on Rajamouli Mahesh movie all these are rumours

“RRR” అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో అంతకుమించి… అనే తరహాలో మహేష్ సినిమాని జక్కన్న చెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు మొత్తం విజయేంద్ర ప్రసాద్ చూసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమంతుడికి దగ్గరగా ఉండే పాత్ర అని ఇటీవల ఓ వార్త వైరల్ కావడం జరిగింది. ఫారెన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని హనుమంతుడి స్ఫూర్తితో రాసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. ‘రాజమౌళికి పౌరాణిక కథలు ఇష్టం. వాటి నుంచి ప్రేరణ పొందుతాడు. తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయి. రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. కానీ, మహేశ్‌బాబు పాత్ర హనుమాన్‌ స్ఫూర్తితో ఉండదు.

Vijayendra Prasad's sensational comments on Rajamouli Mahesh movie all these are rumours

అలాగే ఏ పౌరాణిక పాత్రతోనూ పోలి ఉండదు’ అని స్పష్టం చేశారు. వస్తున్నా వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే ఫారెస్ట్ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో హాలీవుడ్ నీ మించే విధంగా జక్కన్న తీయనన్నట్లు సమాచారం. మహేష్ బాబు రన్నింగ్ హైలైట్ అయ్యేలా… ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ అత్యధికంగా ఆఫ్రికా అడవులలో తీయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే మహేష్ బాబు సినిమా బాహుబలి, RRR సినిమాల బడ్జెట్ కంటే అత్యధికమైన బడ్జెట్ తో నిర్మాణం కాబోతున్నట్లు మూడు విభాగాలుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

Singer Sunitha : అందము – పాటలు .. :: సింగర్ సునీత ఫ్యాన్స్ కోసం సూపర్ సర్‌ప్రైజ్ !

Ram

Prabhas: మరో బాలీవుడ్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన ప్రభాస్..??

sekhar

కీర్తిసురేశ్‌కి దిల్‌రాజు స‌పోర్ట్‌

Siva Prasad