Vikram: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా వచ్చిన “కేజీఎఫ్ 2” ఏప్రిల్ నెలలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయిన “కేజీఎఫ్ 2” ఓవరాల్ గా వేయి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో విడుదలై… కలెక్షన్ల సునామీ సృష్టించింది. వాస్తవానికి కన్నడ చిత్రం అయినా గాని..ఇతర భాషలో డబ్ అయి.. రికార్డుల మోత మోగించింది. ఓవరాల్ కలెక్షన్ ల పరంగా ఇండియాలో టాప్ ఫైవ్ లో నిలిచింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన “విక్రమ్” ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కావడం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో… కమల్ హాసన్ తో పాటు… విజయ్ సేతుపతి, సూర్య కూడా నటించడం జరిగింది. “విక్రమ్” అనేక భాషలలో విడుదలై.. అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో “విక్రమ్” 9 రోజులలోనే “కేజీఎఫ్ 2” రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. “విక్రమ్” తొమ్మిది రోజుల్లో 121 ₹ కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ లెక్కతో ఒక్క “కేజీఎఫ్ 2” మాత్రమే కాదు విజయ్ నటించిన “బీస్ట్” రికార్డులను కూడా విక్రమ్ బ్రేక్ చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో “విక్రమ్ “సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టెక్నికల్ గా స్టోరీ పరంగా టేకింగ్…గా లోకేష్ కనగరాజ్ అద్భుతమైన పనితీరు కనబర్చడంతో “విక్రమ్” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. లెజెండ్ నటుడు కమల్ హాసన్ కొన్ని సంవత్సరాల తర్వాత హీరోగా ప్రధాన పాత్రలో కనిపించటంతో.. సినీ లవర్స్ “విక్రమ్” చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్ లు రాబడుతోంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…