ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చాలా సినిమాలు ఇటీవల సోషల్ మీడియాలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. బాయ్ కాట్ అనే హ్యష్ ట్యాగ్ కి ఆ కొత్త సినిమా టైటిల్ కలిపి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ.. హేటర్స్ అనేక సినిమాలను పరాజయం పాలు చేయడం జరిగింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన “లాల్ సింగ్ చాడా” కి వ్యతిరేకంగా సినిమా రిలీజ్ అవ్వక ముందు నుండి భారీ ఎత్తున ప్రచారం చేశారు. దీంతో దేశంలో ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు సాధించకపోయినా గాని ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ “లైగర్” కి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. బాయ్ కాట్ “లైగర్” అనే హ్యశ్ ట్యాగ్ బాగా వైరల్ చేసి సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు అని ఇంకా డ్రగ్స్ తీసుకునే అమ్మాయి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
“లైగర్” నీ బాయ్ కాట్ చేయండి సినిమా ఎవడో చూడొద్దు అంటూ ప్రచారం చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో విక్రమ్ కొత్త సినిమా కోబ్రా ప్రమోషన్ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న టైంలో ఓ విలేఖరి..బాయ్ కాట్ ప్రచారం గురించి ప్రశ్నించడం జరిగింది. దీనికి విక్రమ్ వెరైటీగా సమాధానం ఇచ్చారు. నాకు బాయ్ తెలుసు.. కాట్ తెలుసు. మరి ఈ బాయ్ కాట్ అంటే ఏమిటి..? నాకు అర్థం కావడం లేదు..? అంటూ పెద్దగా కాంట్రవర్సీ అవ్వకుండా సున్నితంగా చాలా తెలివిగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. “కోబ్రా” ఈనెల 31 వ తారీకు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రమోషన్ కార్యక్రమంలో మీడియా సమావేశంలో విక్రమ్ పాల్గొని సినిమా గురించి అనేక విషయాలు తెలియజేశారు.
తెలుగు ప్రేక్షకులకు తన నటనతో ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. “కోబ్రా” లో నాది ఎమోషనల్ క్యారెక్టర్. ఒక్కో మేనరిజం చాలా ఇష్టపడి చేశాను. టెక్నికల్ గా ఇది చాలా యూనివర్సల్ సినిమా. అన్ని అంశాలు “కోబ్రా” లో ఉంటాయి.. అంటే విక్రమ్ చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ మూడు సంవత్సరాల కష్టమే ఈ సినిమా అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి అంటూ పిలుపునిచ్చారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!