డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇప్పుడు హీరోగా కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మాణంలో వినాయక్ హీరోగా నటించడానికి రెఢీ అవుతున్నారు. అయితే ఆయన హీరోగానే సినిమాలు చేస్తారా? ఇకపై డైరెక్షన్ చేయరా? అంటే అదేం లేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వినాయక్ ఆసక్తి అంతా డైరెక్షన్ పైనే ఉందని అంటున్నారు. అయితే ఈయనకు అవకాశాలు కరువైయ్యాయి. బాలకృష్ణతో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోవడంతో వినాయక్ ఖాళీ అయ్యాడు. ఈలోపు వినాయక్‌ని దిల్‌రాజు హీరోని చేసేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాలను పక్కకు పెడితే వినాయక్ డైరెక్షన్ చేయడానికి ఓ యువ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ మరో సినిమాను ఓకే చేయలేదు. మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. రామ్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో వినాయక్ ఉన్నాడని టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.
previous post
next post