ట్రేడ్ వర్గాలకే చుక్కలు చూపిస్తున్న రామ్… కొ ణి దె ల

వినయ విధేయ రామ… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన మొదటి సినిమా. రంగస్థలం లాంటి హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని మోస్తూ ఈ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కంప్లీట్ నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థీయేటర్స్ లో ఎక్కువ కాలం ఉండడం కష్టమని అంతా అనుకున్నారు కానీ మితిమీరిన హింసతో క్లాస్- మాస్ ఇద్దరినీ మేపియించలేకపోయిన బోయపాటి ఫెయిల్ అయ్యాడు. ఇక పెట్టిన డబ్బులు కూడా రావు అనుకుంటున్న సమయంలో చరణ్ మ్యాజిక్ పని చేయడం మొదలయ్యింది. థియేటర్స్ దగ్గర క్రౌడ్ తగ్గలేదు, వచ్చే వసూళ్లు ఆగలేదు. ఒక కంప్లీట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా వారం తిరగకముందే 50కోట్ల షేర్ ని రాబట్టింది అంటే అది నిజంగా మెగా పవర్ స్టార్ సత్తానే. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా చేస్తున్న ఈ కలెక్షన్స్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. నిజానికి వినయ విధేయ రామ సినిమాని 90 కోట్లకి అమ్మారు, అంటే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 91 కోట్ల షేర్ అయినా రాబట్టాలి. ఇప్పుడు అయిదు రోజుల్లో చరణ్ రాబట్టిన కలెక్షన్స్ చూస్తుంటే లాంగ్ రన్ లో కానీ ఫుల్ రన్ లో కానీ మిగిలిన 40కోట్లు తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.

ఒక ఫ్లాప్ సినిమాతో బ్రేక్ ఈవెన్ చేసినా, లాభాల బాటలో నడిపించినా అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎన్నో సినిమాలకి సాధ్యం కానీ ఈ రికార్డ్ ని ఈసారి కొట్టి, అసలైన సంక్రాంతి హీరో తానేనని చరణ్ ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి.