సినిమా

Virata Parvam: రానా `విరాట పర్వం`కు మోక్షం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Share

Virata Parvam: రానా ద‌గ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. ఇందులో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రియ‌మ‌ణి, నవీన్ చంద్ర, నందితా దాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. షూటింగ్ పూర్తై చాలా కాలం అయింది. కానీ, ఈ సినిమా విడుద‌ల‌కు మాత్రం నోచుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఎన్నో సార్లు రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఏదో కార‌ణం చేత వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. దీంతో ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే విడుద‌ల అవుతుంద‌ని అనుకున్నారు.

కానీ, అందుకు నిర్మాత‌లు ఒప్పుకోలేదు. థియేట‌ర్స్‌లోనే సినిమాను విడుద‌ల చేస్తామ‌ని గ‌త కొద్ది నెల‌ల నుంచీ చెబుతూ వ‌స్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రిలీజ్‌కు మోక్షం క‌లిగింది. తాజాగా మేక‌ర్స్ విరాట ప‌ర్వం కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. జూలై 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్ సైతం షురూ కానున్నాయి. కాగా, 1990ల‌లో తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన న‌క్స‌లైట్ ఉద్య‌మం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇందులో నక్సలైట్స్‌గా రానా మ‌రియు ప్రియ‌మ‌ణిలు క‌నిపించ‌బోతున్నారు.


Share

Related posts

Anchor Anasuya : అమ్మో యాంకర్ అనసూయ అరాచకమైన ఫోటో.. కుర్రాళ్ళు ఇంక ఎక్కడ ఆగుతారు!

Ram

karthika Deepam: నిరూపమ్ కి పెళ్లి సంబంధం తెచ్చిన స్వప్న… సీన్ లోకి మోనిత… ఇకమీదట ఏమి జరిగిద్దో మరి..!!

Ram

Krithi shetty: ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి పోటీ ఇస్తుంది కృతి శెట్టి..ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నాయో చూడండి

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar