ట్రెండింగ్ న్యూస్ సినిమా

Virata Parvam Release Date: విరాటపర్వం మువీ విడుదలపై డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

Share

Virata Parvam Release Date: రానా కథానాయకుడిగా చిత్రీకరించిన మువీ విరాటపర్వం ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ మువీని ఓటీటీలో విడుదల  చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు వేణు ఊడుగుల. ఈ మువీకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పిన ఆయన ధియేటర్ లలోనే ఈ మువీని విడుదల చేయాలన్న పట్టుదలతో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులను చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పారు వేణు.

Virata Parvam Release Date clarification by director venu
Virata Parvam Release Date clarification by director venu

విరాటపర్వంలో కథానాయకుడు రానా సరసర నాయకగా సాయి పల్లవి నటించారు. సురేష్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 1990 లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఆయన ఈ మువీ చేస్తున్నారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారని అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అరణ్య తరువాత రానా నుండి వస్తున్న ఈ మువీ ఎలాంటి రిజల్టు వస్తుందోనని అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Share

Related posts

హాలీవుడ్ స్టార్ రేంజ్ లో పవర్ స్టార్ రెమ్యూనరేషన్.. ఆ రెమ్యూనరేషన్ తో ఎన్ని సినిమాలు తీయోచ్చో తెలుసా..?

GRK

“F3” స్క్రిప్టులో సరికొత్త మార్పులు చేసిన అనిల్ రావిపూడి..!!

sekhar

నటుడు ప్రకాష్ రాజ్ ను ఒక రేంజ్ లో ఆడేసుకున్న నాగబాబు…!

arun kanna