హీరోయిన్ నయనతారపై సీనియర్ యాక్టర్ రాధారవి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. పలువురు రాధారవికి వ్యతిరేకంగా .. ఆయన మాటలను తప్పు పడుతున్నారు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ.. నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ ట్విట్టర్ వేదికగా రాధారవి చర్యను తప్పు పట్టారు. మహిళలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలను ఖండించిన విశాల్ ఆయన ఇంకా ఎదగాల్సి ఉందన్నారు. అంతే కాకుండా.. ఆయన పేరులో కూడా స్త్రీ పేరు ఉంది కదా.. కాబట్టి ఆయన్ని ఇకపై ఆ రవి అని పిలవనివ్వాలని అన్నారు విశాల్. నిర్మాణ సంస్థ కె.జి.ఆర్ స్టూడియోస్ తమ బ్యానర్లో చేసే సినిమాల్లో ఇకపై రాధారవిని నటింప చేయమనీయమని.. తన మిత్రులైన ఇతర సంస్థలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది.
previous post
next post