విక్టరీనే టార్గెట్ గా వస్తున్న వినాయక్

Share

చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తో టూ ఇయర్స్ బ్యాక్ భారీ సక్సెస్ హిట్ కొట్టాడు వి.వి.వినాయక్.. ఖైదీ నంబర్ 150 హిట్ అయిన వినాయక్‌కు దక్కిన క్రెడిట్ చాలా తక్కువే.. ఆ తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటిలిజెంట్ ఫ్లాప్ కావడంతో వినాయక్ క్రేజ్‌ అమాంతం తగ్గిపోయింది.. తేజు అయితే వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ వినాయక్ మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్లాప్‌ల్లో ఉన్న వినాయక్‌తో సినిమా అంటేనే స్టార్ హీరోలు సైతం భయపడిపోతున్నారు.ఇక చిన్న హీరోలు కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు.

కొంతకాలంగా డిజాస్టర్ డైరెక్టర్ అనిపించుకుంటున్న వినాయక్ పరిస్థితి అర్దం చేసుకోని బాలయ్య ఓ సినిమా చేయబోతున్నా డు. ఇక బాలయ్య ఇచ్చిన అవకాశాని వినియోగించుకోని మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని ప్లాన్ చేసుకున్న వినాయక్ కి బోయపాటి భారీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇది అయిపోయాక బోయపాటి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో వినాయక్, ఇప్పుడు డైలమాలో పడిపోయాడు. బాలయ్య కోసం పూర్తి కథని సిద్ధం చేసి, సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్న సమయంలో క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు వినాయక్ మరోహీరో కోసం వేట మొదలుపెట్టాడు. బాలయ్య కోసం రాసిన కథకే మార్పులు చేసిన వినాయక్, ఆ స్టోరీని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇది అఫీషియల్ గా ఎంత వరకూ నిజమనేది తెలియదు కానీ వెంకీ మాత్రం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు, టైంలో ఒక మంచి యాక్షన్ మూవీ పడితే వినాయక్ కెరీర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్లే.


Share

Related posts

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌ను చూసి ఓర్వలేకపోతున్నది ఎవ్వరో తెలుసా?

Naina

Ram Charan : తన సినీ జీవితంలో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..?

Teja

`రాజ్‌దూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Siva Prasad

Leave a Comment